ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదో కార్పొరేషన్.. సౌకర్యాలు తక్కువ.. సమస్యలు ఎక్కువ! - ఓంగోలులో సమస్యలను ఎదుర్కొంటున్న కాలనీలు

COLONIES PROBLEMS: పేరుకు కార్పొరేషన్ అయినా ఒంగోలు నగర శివారు కాలనీల్లో అన్నీ సమస్యలే. ప్రాథమిక సౌకర్యాలు లేక ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధికి నోచుకోని నగర శివారు ప్రాంతాలపై ప్రత్యేక కథనం.

Ong
ఒంగోలు

By

Published : Feb 6, 2023, 5:41 PM IST

Updated : Feb 6, 2023, 5:56 PM IST

COLONIES PROBLEMS: ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో చుట్టూ ఉన్న శివారు కాలనీలు పరిస్థితి దారుణంగా తయారయ్యాయి... ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న కాలనీలతో పాటు, మురికివాడలు, వాగులకు ఆనుకొని ఉన్న కాలనీలు అన్నీ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం విఫలమవుతుందని ప్రజలు వాపోతున్నారు.. పట్టణం శివారులో 32 కాలనీలు ఉన్నాయి... పట్టణ జనాభాలో సగం ఇక్కడే నివాసముంటున్నారు.

నేతాజీ కాలనీ, రాజీవ్‌ కాలనీ, ఇందిరాకాలని, బలరాం కాలని, కేశవరాజుకుంటు, చినమల్లేశ్వరకాలని, వెంకటేశ్వరకాలని, నాగేంధ్రనగర్, విరాఠ్‌నగర్ తదితర కాలనీల్లో ఎన్నో ఏళ్ళుగా వేలాది మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు... కాలనీలకు రహదారులు, కాలువలు నిర్మాణాలు చేపట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.. రాకపోకలకు దారులు లేకపోవడం, మురుగునీరు ఎక్కడపడితే అక్కడే నిలిచిపోవడంతో దోమలు, పందులు స్వైర్యవిహారం చేస్తున్నాయి.

రహదారులు నిర్మాణాలు చేపట్టకపోగా, భారీ వాహనాలు రాకపోకల వల్ల ఉన్న రోడ్లు కూడా పాడవుతున్నాయని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. జయప్రకాశ్‌ కాలనీలో సచివాలం, అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలలు వంటివి ఏర్పాటు చేయలేదు... ఎన్నో ఏళ్ళుగా నివాశముంటున్నా, సమస్యపై అడుగుతున్నా స్పందన కరవువుతుందని వీరు పేర్కొంటున్నారు...పీర్లమాన్యం, క్రాంతినగర్‌ కాలనీల సమీపంలో పట్టణ ఆరోగ్య కేంద్రం నిర్మించినా, ఇంతవరకూ ప్రారంభానికి నోచుకోలేదు..వాలంటరీ వ్యవస్థ వున్నా సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. అవసరానికి ఒక్కరూ కనిపించడంలేదు... వీధిలైట్లు పాడయినా పిర్యాదు చేయడానికి కూడా దిక్కులేదని వాపోతున్నారు.

మున్సిపాలిటి కార్మికులు కాలనీలను శుభ్రం చేయటంలేదు. ఏదో నామమాత్రంగా పనిచేసి వెళ్లిపోతారు. వాలంటీర్లు కూడ ఎవరిని పట్టించుకోవటం లేదు. ఇక దేనికి వాలంటీర్లు ఉన్నది. -బ్రహ్మయ్య, ఒంగోలు

కాలనీలో కనీస సౌకర్యాలు కూడ సరిగ్గా లేవు సరైన రోడ్లు లేవు, నీటి సమస్య, కరెంట్ ఉండదు, వర్షం పడితే మోకాళ్ల లోతు నీళ్లు వస్తాయి. మురికి కాలువలు లేక వర్షపు నీటిని ఎత్తి పోసుకునే పరిస్థితి -వీరభద్రాచారి, ఒంగోలు

సమస్యలు ఎదుర్కొంటున్న కాలనివాసులు

ఇవీ చదవండి:

Last Updated : Feb 6, 2023, 5:56 PM IST

ABOUT THE AUTHOR

...view details