పొగాకు కొనుగోళ్లకు ప్రకాశం జిల్లాలో 40 సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని, వీరందరూ విధిగా వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. జిల్లాలో పొగాకు కొనుగోళ్లపై ఏర్పడ్డ సంక్షోభంపై... కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఈ ఏడాది లక్ష్యానికి తగినంతగా పొగాకు కొనుగోళ్లు జరగలేదని చెప్పారు.
ఈ సందర్భంగా.. కలెక్టర్కు రైతులు సమస్యలు విన్నవించారు. పెట్టుబడుల ఖర్చు 35 శాతం పెరిగిందని, లో గ్రేడ్ పొగాకు కిలోకు రూ. 82.44 మాత్రమే చెల్లించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పారు. కనీసం 100 రూపాయలకు తక్కువ కాకుండా ఇప్పించాలని కోరారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని బోర్డు అధికారులు, బయ్యర్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోరారు. జాయింట్ కలెక్టర్ మురళి, పొగాకు బోర్డు ఆర్ఎమ్ షేక్ అబ్దుల్లా పాల్గొన్నారు.