ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం పెదపూడి గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు వాగులో పడి మరణించాడు. భారీగా కురిసిన వర్షాలకు వాగులు ఉప్పొంగటంతో ఘటన జరిగింది. జిల్లా పాలనాధికారి పోలా భాస్కర్ బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున నాలుగు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ప్రమాదం జరిగిన తీరును కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ పరామర్శ.. రూ.4 లక్షల చెక్కు అందజేత - cheque given by prakasham district collector
ప్రకాశం జిల్లాలో ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని కలెక్టర్ పోలా భాస్కర్ పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించారు.
చెక్కును అందిస్తున్న కలెక్టర్