ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పథకాల లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి : కలెక్టర్ పోల భాస్కర్

By

Published : Feb 19, 2021, 3:55 AM IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం, తదితర పథకాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్
సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్



ప్రకాశం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో పాలనాధికారి పోల భాస్కర్ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం, తదితర పథకాలను సమీక్షించారు. పథకాల లక్ష్యాలను గడువులోగా చేరుకోవాలని, అభివృద్ధి కార్యక్రమాలలో పురోగతి సాధించాలని కలెక్టర్ తెలిపారు. ఉపాధి హామీ పథకం అమలులో అవాంతరాలను అధిగమించాలన్నా ఆయన.. నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆ పథకం అన్ని మండలాలకు విస్తరింపు..

వైఎస్ఆర్ జీవ క్రాంతి పథకం, వైఎస్ఆర్ చేయూత పథకాల అమలులో పశుసంవర్థక శాఖ డిఆర్​డిఏ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పది మండలాలకు 260 యూనిట్లు ఈ నెల చివరినాటికి పంపిణీ చేయాలన్నారు. అమూల్ సంస్థ భాగస్వామ్యంతో పాల ఉత్పత్తుల సేకరణ ప్రస్తుతం 201 గ్రామాల్లో జరుగుతుండగా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు వాటిని విస్తరింపచేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పాల ఉత్పత్తుల సేకరణ కోసం బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందున క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు అమూల్ సంస్థ ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు.

దశలవారీగా నగదు..

అర్హులైన పేదలందరికీ మంజూరైన పక్కా గృహాలను లబ్ధిదారులు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. కొత్త పట్నంలో 934 నుంది ఇళ్లు నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉండగా వారికి దశలవారిగా నగదు పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. చీరాలలో 979 మంది లబ్ధిదారులకు గాను 13 మంది ఆప్షన్లు ఇచ్చారని మిగిలిన వారి వివరాలపై ఆయన ఆరా తీశారు.

ఇదీ చదవండి

ద్విచక్ర వాహనం బోల్తా... వార్డు సభ్యురాలి భర్త మృతి

ABOUT THE AUTHOR

...view details