ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెలిగొండ ప్రాజెక్టుపై కలెక్టర్ సమీక్ష... నిర్వాసితుల నిరసన - collector review meeting at prakasham district

ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు పునరావాసం, పునర్​నిర్మాణ ప్యాకెేజీ పనుల పురోగతిపై దోర్నాల నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్​లో కలెక్టర్ పోల భాస్కర్ సమీక్షా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పలు గ్రామాల నిర్వాసితులు తమ సమస్యలను కలెక్టర్​కు విన్నవించేందుకు ప్రయత్నించారు.

collector review meeting on veligonda project at dhornala prakasham distric
వెలిగొండ ప్రాజెక్టు పై కలెక్టర్ సమీక్షా... నిరసన తెలిపిన నిర్వాసితులు

By

Published : Jun 25, 2020, 4:27 PM IST

ప్రకాశం జిల్లా దోర్నాలలో వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై కలెక్టర్ పోలా భాస్కర్ దోర్నాల నీటి పారుదల శాఖ గెస్ట్ హౌస్​లో సమీక్షా నిర్వహించారు. ఈ సమావేశానికి నీటిపారుదల, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఇటీవల ప్రభుత్వం ఎకరాకు 12 లక్షలు పరిహారం చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమావేశం విషయం తెలుసుకున్న పలు గ్రామాల నిర్వసితులు తమ సమస్యలను కలెక్టర్​కు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ వారికి అవకాశం ఇవ్వకపోవడంతో నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం ఎకరాకు 12.5 లక్షలు ఇస్తామని చెప్పిందని, దాన్ని వ్యతిరేకించి పరిహారం తీసుకోలేదని తెలిపారు. ఎన్నికలకు ముందు వైకాపా నాయకులు ఎకరాకు 20 లక్షలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని, కాని ఇప్పుడు పాత పరిహారమే ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని నిరసన చేపట్టారు.

ఇదీ చదవండి: గూడ్స్ రైలు ప్రమాదంలో భారీ నష్టం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details