ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ కట్టడి చర్యలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ కార్యాలయంలో.. కొవిడ్ కట్టడి చర్యలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష జరిపారు. వ్యాక్సినేషన్, అదనపు పడకల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు.

collector pola bhaskar in markapuram
మార్కాపురంలో కలెక్టర్ పోల భాస్కర్ సమీక్ష

By

Published : May 12, 2021, 9:19 PM IST

కొవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. మార్కాపురం పురపాలక శాఖ కార్యాలయంలో.. రెవెన్యూ, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణ, వ్యాకిన్ వేగవంతం చేయడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. మండలంలో ఒక అర్బన్ హెల్త్ సెంటర్, ఒక ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాన్ని ఎంపిక చేసి.. వ్యాక్సినేషన్‌కు వైద్యులు చర్యలు తీసుకోవాలని చూచించారు. గతంలో మొదటి డోస్ వేయించున్నవారికి మాత్రమే రెండో డోస్ ఇవ్వాలన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో మొదటి డోస్ టీకా వేయడానికి మరి కొంత సమయం పడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. మొదటి విడత టీకా వేసుకున్నవారి ఇళ్లకు వెళ్లి.. రెండో డోస్ కోసం స్లిప్లులు పంపిణీ చేయాలని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మార్కాపురంలోని జిల్లా ఆస్పత్రిలో అదనపు పడకలు ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించారు. వైద్యశాల ప్రాంగణంలో 5,400 చదరపు అడుగుల వైశాల్యంలో 60 పడకలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు తయారు చెయ్యాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details