సచివాలయ వ్యవస్థ పనితీరును పరిశీలించేందుకు ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అద్దంకి పట్టణంలోని గానుగపాలెం వెళ్లారు. అధికారుల పనితీరును గురించి ఆరా తీశారు. ప్రస్తుతం పట్టణంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికి ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా సచివాలయ వ్యవస్థ పనిచేయాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవానికి అందేలా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పని చేయాలన్నారు.
జిల్లాలో అమూల్ కంపెనీ ద్వారా భవిష్యత్తులో పాల సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. 200 గ్రామాల సంబంధించి 162 రైతు భరోసా కేంద్రాల ద్వారా పాల సేకరణ జరుగుతుందన్నారు. పాడి పశువులపై ఆధారపడి జీవిస్తున్న రైతాంగానికి ఇదో వరంగా మారనున్నట్లు తెలిపారు. ప్రతి లీటర్ కు పది రూపాయలు అదనంగా ఆదాయం వస్తుందని చెప్పారు.