ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గిరిజన భవనంలో అత్యవసరంగా 70 పడకలు ఏర్పాటు చేయాలి' - ఒంగోలు కలెక్టర్ వార్తలు

కరోనా వైరస్ రెండవ దశ వ్యాప్తి నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్... ఒంగోలు జీజీహెచ్ ఆసుపత్రిలోని కొవిడ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఐసీయూలోని బెడ్ల వివరాలను ఆరా తీశారు. గిరిజన భవనంలో అత్యవసరంగా 70 పడకలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

collector visited ggh
collector visited ggh

By

Published : Apr 24, 2021, 8:37 PM IST

కరోనా వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్యం అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు. కొవిడ్ కేంద్రం వద్ద ఓపీ విభాగాన్ని ఆయన పరిశీలించారు. అత్యవసర విభాగంలోని బెడ్ల వివరాలను ఆరా తీశారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులు, వైరస్ సోకిన వారు పెద్ద ఎత్తున జీజీహెచ్​కు వస్తున్న కారణంగా.. ఆ రద్దీని పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు.

గిరిజన భవనంలో అత్యవసరంగా 70 పడకలను ఏర్పాటు చేయాలని సంబంధిత సిబ్బందిని కలెక్టర్ ఆదేశారు. ఆ భవనం నుంచి జి.జి.హెచలోనికి వెళ్లడానికి అడ్డుగా ఉన్న గోడ తొలగించి గేట్లు అమర్చాలని దిశానిర్దేశం చేశారు. కరోనా బాధితులకు పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని చర్యలను వీలైనంతగా తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details