అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కురిచేడు ప్రజల విరాళం - ప్రకాశం తాజా సమాచారం
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని పలు గ్రామాల్లో భక్తులు విరాళాలు సేకరించారు. ఈ మొత్తాన్ని కురిచేడు మండల రామమందిర విరాళాల సేకరణ బాధ్యులు ఎరువ లక్ష్మీనారాయణరెడ్డికి అందజేశారు.
కురిచేడులో అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ
ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని పలు గ్రామాల్లో... అయోధ్య రామమందిర నిర్మాణానికి రామ భక్తులు విరాళాలు సేకరించారు. విరాళాల ద్వారా వచ్చిన మొత్తం రూ.3 లక్షల 13 వేల 300 నగదును కురిచేడు మండల రామమందిర విరాళాల సేకరణ బాధ్యులు ఎరువ లక్ష్మీనారాయణరెడ్డికి అందజేశారు. ఈ విరాళాల సేకరణకు కురిచేడు, పొట్లపాడు గ్రామస్థులు సహకరించారు.