వెలుగులోకి రైతుమిత్ర శీతల గిడ్డంగి యజమాని అక్రమాలు - PRAKASHAM
ప్రకాశం జిల్లా మేదరమెట్లలో వెలుగులోకి రైతుమిత్ర శీతల గిడ్డంగి యజమాని అక్రమాలు వెలుగుచూశాయి. రైతుల ఉత్పత్తులపై రూ. 12 కోట్ల రుణం పాండురంగారావు పొందారు. మోసాన్ని గుర్తించిన అధికారులు శీతల గిడ్డంగిని పరిశీలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిడ్డంగిని పరిశీలించిన దర్శి డీఎస్పీ ప్రకాశరావు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ప్రకాశం జిల్లా మేదరమెట్లలో ఓ శీతల గిడ్డంగి యజమాని అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రైతుమిత్ర కోల్డ్ స్టోరేజ్ యజమాని పాండురంగారావు...తన గిడ్డంగిలో రైతులు ఉంచిన వ్యవసాయ ఉత్పత్తులపై 2017లో ఇండియన్ బ్యాంక్ నుంచి 12 కోట్ల రూపాయల రుణం పొందారు. దాదాపు 54 మంది రైతుల పేర్ల మీద రుణం తీసుకున్నారు. బ్యాంకు అధికారులు శీతల గిడ్డంగిని పరిశీలిస్తే.... పంట ఉత్పత్తులు కనిపించలేదు. జరిగిన మోసంపై....పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. దర్శి డీఎస్పీ ప్రకాశ రావు గిడ్డంగిని పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.