వైఎస్సార్ ఆసరా పథకం రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేడు ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభించనున్నారు. ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరగనున్న కార్యక్రమంలో సీఎం జగన్ నిధులు విడుదల చేయనున్నారు. సీఎం జగన్ రేపు ఉదయం 9.55 గంటలకు తాడేపల్లి నుంచి ఒంగోలుకు బయలుదేరతారు. ఉదయం 11 గంటలకు ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ ఆసరా సభా వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ పరిశీలిస్తారు. అనంతరం సభా వేదిక వద్ద లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. సీఎం ప్రసంగం తర్వాత వైఎస్‌ఆర్ ఆసరా కార్యక్రమం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.05 నిముషాలకు తిరుగు పయనమవుతారు. 1.55 నిముషాలకు తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
Ysr asara: నేడు 'వైఎస్సార్ ఆసరా' పథకం రెండో విడత రుణమాఫీ నిధుల విడుదల - సీఎం జగన్ ఒంగోలు పర్యటన
ఇవాళ వైఎస్సార్ ఆసరా పథకం రెండో విడత రుణమాఫీ నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరగనున్న కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.
cm jagan ongole tour
Last Updated : Oct 7, 2021, 12:24 AM IST