ఒంగోలు పట్టణంలో ఇటీవల 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం సంఘటనపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. అమరావతిలోని ప్రజావేదికలో నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సమావేశంలో ఈ దుర్ఘటన గురించి సీఎం ప్రస్తావించారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కేసు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. 24 గంటల వ్యవధిలోనే ప్రమేయం ఉన్న ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు ఎస్పీ సీఎంకు తెలిపారు. నేరం జరిగిన విషయం తెలిసిన వెంటనే స్పందించి... రాత్రికి రాత్రే నిందితులను అరెస్టు చేసిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌తోపాటు... జిల్లా పోలీసులను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారు.
సామూహిక అత్యాచార నిందితుల అరెస్టుపై ఎస్పీకి ప్రశంసలు - సామూహిక అత్యాచార నిందితుల అరెస్టుపై ఎస్పీకి ప్రశంసలు
ఇటీవల 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం సంఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. 24 గంటల వ్యవధిలోనే ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేయడంపై ఎస్పీని ప్రశసించారు.
సామూహిక అత్యాచార నిందితుల అరెస్టుపై ఎస్పీకి ప్రశంసలు
TAGGED:
gang rape in Ongole