కుట్రలు సాగవు.. పరుగులు పెట్టిస్తాం జాగ్రత్త! - నిర్ణయం తీసుకుంటే బుల్లెట్‌లా దూసుకెళ్తా... సీఎం
నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. వైకాపా, తెరాస నేతలు రాక్షసుల్లా ఆటంకం కలిగిస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎన్నికల ప్రచారానికి హాజరైన సీఎం.. పోలవరం కడితే భద్రాచలం మునుగుతుందని కేసీఆర్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అవసరమైతే భద్రాచలాన్నీ తామే తీసుకుంటామని హెచ్చరించారు.

cm-gidhaluru
కుట్రలు సాగవు.. పరుగులు పెట్టిస్తాం జాగ్రత్త!
60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని బాబు చెప్పారు. త్వరలోనే మిగిలిన ఖాళీలూభర్తీ చేస్తామని ప్రకటించారు. వెలుగొండ పూర్తయితే గిద్దలూరు సస్యశ్యామలం అవుతుందన్న సీఎం...గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం ప్రాంతాలకు నీళ్లు ఇస్తామన్నారు. డబ్బులు పంచేందుకు కోడి కత్తి పార్టీ సిద్ధమైందని ఆరోపించారు. పుట్టా సుధాకర్ యాదవ్, నానిపై కావాలనే ఐటీ దాడులు చేశారని మండిపడ్డారు. తెలుగు తమ్ముళ్లు తిరగబడితే పరుగులు పెడతారని హెచ్చరించిన చంద్రబాబు.... తన పోరాటం భావితరాల భవిష్యత్తు కోసమని స్పష్టం చేశారు.