ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బెల్లంకొండవారిపాలెంలో వైకాపా నాయకుల మధ్య ఆదివారం ఘర్షణ చోటు చేసుకుంది. ఓ వాలంటీర్, ఆ గ్రామ వైకాపా నాయకుడు ఉమామహేశ్వరరెడ్డికి మధ్య వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన ప్రచార పత్రాలు తీసుకునే విషయమై గ్రామంలోని బొడ్డురాయి సమీపంలో వివాదం తలెత్తింది. అదే సమయంలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా బరిలో నిలిచిన కె.అంజిరెడ్డి అనే వ్యక్తి అక్కడికి వచ్చి సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. ఇంతలో స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీటీసీ బరిలో నిలిచిన జి.ప్రభాకరరెడ్డి అక్కడికి వచ్చి అంజిరెడ్డిపై దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయమై క్షతగాత్రుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనను వైద్య చికిత్సల నిమిత్తం దర్శి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బీకే పాలెంలో వైకాపా నాయకుల మధ్య ఘర్షణ.. ఒకరికి గాయాలు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ వైకాపా నాయకుల మధ్య కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. తాళ్ళూరు మండలంలోని బెల్లంకొండ వారిపాలెం గ్రామంలో అధికార వైకాపా నాయకుల మధ్య నెలకొన్న వివాదాలు దాడులకు దారి తీశాయి. ఘటనలో ఎంపీటీసీ భర్త అంజిరెడ్డి గాయపడ్డాడు.
దర్శి నియోజకవర్గ వైసీపీ నేతల మధ్య కుమ్ములాట
ఇవీ చదవండి