ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపాలో ఇరు వర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు - clashes between ysrcp leaders in Ramayapalem

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం రామాయపాలెంలో వైకాపాలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

clashes between two groups
వైకాపా నాయకుల మధ్య ఘర్షణ

By

Published : Apr 9, 2021, 3:21 PM IST

ప్రకాశం జిల్లా రామాయపాలెంలో పరిషత్ ఎన్నికల్లో వైకాపాకు చెందిన ఓ వర్గం వారు.. తెదేపాకు మద్దతుగా నిలిచారంటూ అదే పార్టీకి చెందిన మరో వర్గం ఫేస్​బుక్​లో పోస్టు చేశారు. ఈ విషయంపై నిన్న రాత్రి ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో మాజీ సర్పంచి సాంబిరెడ్డి, ఆయన కుమారుడు కిరణ్, పోతయ్య, ఏసోబుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. క్షతగాత్రులను పలువురు వైకాపా నాయకులు పరామర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details