ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Clashes: ఈస్టర్​ ఆరాధనలో ఇరు వర్గాల ఘర్షణ.. రంగంలోకి పోలీసులు - prakasam district news

ప్రశాంతంగా జరగాల్సిన ఈస్టర్​ ఆరాధన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆధిపత్య పోరుతో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. చివరకు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకునే స్థాయికి చేరింది. విషయం తెలుసుకుని పోలీసులు రంగంలోకి దిగి చెదరగొట్టారు.

1
1
author img

By

Published : Apr 17, 2022, 11:58 AM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ఈస్టర్ ఆరాధనలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కొండపైనున్న జూమెట్ మెమోరియల్ చర్చిలో ఈస్టర్ ఆరాధన జరుగుతుండగా.. రెండు వర్గాలు ఆధిపత్య పోరుకు దిగాయి. జాన్ కెన్నెడీ వర్గం, ఆగస్టీన్ వర్గాల వర్గాల మధ్య గొడవతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలు పరస్పరం పిడుగుద్దులు కురిపించుకున్నారు. ఈ పరిస్థితుల్లో భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి... ఇరు వర్గాలను చెదరగొట్టారు. చర్చి ఆవరణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details