ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కూకట్లపల్లిలో.. ఇంటి స్థలం విషయంలో.. ఇరు వర్గాల వారు ఘర్షణ పడ్డారు. ఇప్పటికే ఈ విషయంపై బల్లికురవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. నేడు ఇరువర్గాలు కత్తులతో దాడి చేసుకోగా.. పది మంది గాయపడ్డారు. వారంతా అద్దంకి గవర్నమెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఒంగోలు రిమ్స్‌కి తరలించారు. చిన్నపిల్లలపై కూడా దాడికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు.
group fight: రెండు వర్గాల మధ్య ఘర్షణ.. కత్తులతో దాడులు - clashes between two communities in Kookatlapally
ఇంటి స్థలం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కత్తులతో దాడులు చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
రెండు వర్గాల మధ్య వివాదం