ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపాలో వర్గ పోరు.. కర్రలు, రాళ్లతో దాడులు! - Clash between ycp groups news

ప్రకాశం జిల్లా వేములపాడు వైకాపాలో విభేదాలు... కర్రలు, రాళ్లతో దాడి చేసుకునే వరకు వెళ్లాయి. తమ ప్రత్యర్థికి మద్దతు ఇస్తున్నారనే కారణంతో వైకాపాలోని ఓ వర్గం.. మరో వర్గంపై దాడి చేసింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

Clash between YCP Groups.. Attacks with sticks and stones
వైకాపాలో వర్గపోరు.. కర్రలు, రాళ్లతో దాడులు

By

Published : Feb 8, 2021, 8:25 PM IST

వైకాపాలో వర్గపోరు.. కర్రలు, రాళ్లతో దాడులు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం ఎం.వేములపాడు వైకాపాలో విభేదాలు భగ్గుమన్నాయి. రెండువర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. పలువురికి గాయాలయ్యాయి. వేములపాడు పంచాయతీకి వైకాపా, తెలుగుదేశం పార్టీలు బలపర్చిన ఇద్దరు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం బలపర్చిన అభ్యర్థికి వైకాపాలోని ఒక వర్గం మద్దతు ఇస్తోంది.

ఈ వ్యవహారంపై రెండో వర్గం అభ్యంతరం చెప్పింది. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. వైకాపా పెద్దలతో చర్చించేందుకు కొందరు సంతనూతలపాడు వెళ్లారు. ఆ సమయంలో తక్కువమంది ఉన్నారని చూసుకొని, రెండో వర్గం వారు దాడికి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details