మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా కనిగిరిలో సీఐటీయూ, ఐద్వా, ఎస్ఎఫ్ఐ, పీఎన్ఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మద్యం వద్దు.. ప్రజలకు తిండి కావాలని ప్లకార్డులు పట్టుకొని కనిగిరి రాజీవ్ నగర్ కాలనీలో ఆందోళన చేశారు.
లాక్డౌన్ వల్ల ప్రజల ప్రాణాలు పోతుంటే... ప్రభుత్వం అవేవీ పట్టించుకోకుండా మద్యం దుకాణాలు తెరవటమేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో విద్యార్థి, కార్మిక మహిళ సంఘ నాయకులు పాల్గొన్నారు.