కరోనా లాక్డౌన్తో మూతపడిన సినిమా హాళ్లు దాదాపు 8 నెలల తర్వాత తెరుచుకున్నాయి. గత నెలలోనే సినిమా హాళ్లకు ప్రభుత్వం అనుమతిచ్చినా...థియేటర్ యజమానులు ముందుకు రాలేదు. ప్రకాశం జిల్లా ఒంగోలు రత్నామహల్ థియేటర్లో నేడు సినిమాను ప్రదర్శించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ...50 శాతం సీట్లు భర్తీ అయ్యే విధంగా టికెట్లు విక్రయించారు.
చాలా కాలం తర్వాత సినిమా హాలు తెరుచుకోవటం పట్ల సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలిఆటలోనే 50 శాతం సీట్లు పూర్తి కావటం పట్ల థియేటర్ యజమాని ఆనందం వ్యక్తం చేశారు.