రాష్టం లోటు బడ్జెట్లో ఉన్న ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని సినీనటి దివ్యవాణి అభిప్రాయపడ్డారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ప్రచారం చేసిన ఆమె... ఇంటింటికీ తిరుగుతూ పార్టీ కరపత్రాలు పంచారు. రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్న చంద్రబాబునే గెలిపించాలని తోడుగా నిలవాలని ఓటర్లను కోరారు. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థిగా బుదాల అజితరావు, ఒంగోలు ఎంపీగా శిద్ధా రాఘవరావును భారీ ఆధిక్యంతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
'లోటు బడ్జెట్లోనూ సంక్షేమం చంద్రబాబు ఘనతే' - చంద్రబాబు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో తెదేపా తరపున సినీనటి దివ్యవాణి ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ పార్టీ కరపత్రాలు పంచారు. రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబుకు తోడుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల ప్రచారంలో సినీనటి దివ్యవాణి