వైద్య పరికరాల కొనుగోళ్లలో భాగంగా ప్రభుత్వాసుపత్రుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఫిర్యాదుల మేరకు సీఐడీ అధికారులు పలు ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టారు. ప్రకాశం జిల్లా చినగంజాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీఐడీ సబ్ఇన్స్పెక్టర్ వాసు ఆధ్వర్యంలో అధికారులు రికార్డులను పరిశీలించారు. 2015 నుంచి 2018 మధ్య కాలంలో ఆసుపత్రిలో బయో మెడికల్ పరికరాలు కొనలేదని పరిశీలనలో నిర్దరణ అయింది. అందుకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని సీఐడీ అధికారులు తెలిపారు.
చినగంజాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీఐడీ తనిఖీలు - చినగంజాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీఐడీ తనిఖీలు తాజా వార్తలు
ప్రకాశం జిల్లా చినగంజాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీఐడీ సబ్ఇన్స్పెక్టర్ వాసు ఆధ్వర్యంలో అధికారులు రికార్డులను పరిశీలించారు. వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేపట్టారు.
![చినగంజాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీఐడీ తనిఖీలు CID inspections at Chinganjam Primary Health Center](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11366905-351-11366905-1618149317769.jpg)
చినగంజాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీఐడీ తనిఖీలు