ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగమేలు తల్లికి ఘనమైన జాతర - vetapalem

మహా శివరాత్రి సందర్భంగా ప్రకాశం జిల్లా వేటపాలెంలో చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు ఆరు రోజుల పాటు జరగనున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చారు.

వేటపాలెం

By

Published : Mar 3, 2019, 11:29 PM IST

వేటపాలెంలో చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవాలు
ప్రకాశం జిల్లా వేటపాలెంలోచౌడేశ్వరి అమ్మవారి జాతరవైభవంగా ప్రారంభమైంది. మహాశివరాత్రి సందర్భంగా ఆరు రోజులు ఉత్సవాలుజరగనున్నాయి. శివరాత్రికి ఒకరోజు ముందుగా వేడుక ప్రారంభిచడం ఇక్కడి ఆనవాయితీ. చీరాల, వేటపాలెంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఇప్పటికే వేలాదిగా భక్తులు తరలివచ్చారు. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. నెయ్యి, పిండితో తయారుచేసిన కుంచంలో జ్యోతిని పెట్టి అమ్మవారిని ఊరేగించారు. భక్తులు కత్తులతో పొడుచుకుంటు పరాక్ నిర్వహించారు. అమ్మవారికి రక్తతర్పణం చేశారు. పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు.

ABOUT THE AUTHOR

...view details