ప్రకాశం జిల్లా కనిగిరిలోని కందుకూర్ రోడ్డులో పట్టపగలే చోరీ జరిగింది. ఓ దుకాణంలో యజమాని సరకుల కోసం వెనక్కి తిరగ్గా... బ్యాగ్లో ఉన్న లక్షా 60 వేల నగదు, 2 లక్షల విలువైన బంగారం అపహరించాడు ఓ దుండగుడు. కిరాణా వస్తువుల కొనుగోలు పేరుతో వచ్చిన భార్యాభర్తలు... ఈ చోరీకి పాల్పడ్డారని దుకాణం యజమాని ఏడుకొండలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సరకుల కోసం వచ్చారు... నగదు, బంగారం దోచుకెళ్లారు - కిరణా దుకాణంలో చోరీ...
కందుకూర్ రోడ్డులోని కోర్టు ఎదురుగా ఉన్న దుకాణంలో రూ.లక్షా 60 వేల నగదు, 2 లక్షలు విలువ చేసే బంగారం చోరీకి గురైంది.
కిరణా దుకాణంలో చోరీ... పోలీసులు దర్యాప్తు