ప్రకాశం జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చినగంజాం మండలం సోపిరాలకు చెందిన నరహరి హరికృష్ణ స్థానికంగా బడ్డీకొట్టు నిర్వహిస్తున్నాడు. 20 ఏళ్లుగా చిట్టీ పాటలు కూడా నిర్వహించేవాడు. ఏళ్ల తరబడి చెల్లింపులు సక్రమంగా చేస్తుండటంతో.. చిట్టీలు వేసేవారి సంఖ్య పెరిగింది. అనంతరం వారి నుంచి ఎక్కువ మొత్తంలో అప్పులు తీసుకున్నాడు. ఆరు నెలలుగా చిట్టీలు పాడుకున్నవారికి డబ్బులు కూడా ఇవ్వకుండా కాలయాపన చేశాడు. సుమారు 600 మందికి రూ.8.49 కోట్లు వరకు చెల్లించాల్సి ఉందని బాధితులు తెలిపారు. మోసపోయమని తెలుసుకున్న బాధితులు చినగంజాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.8.49 కోట్లు టోకరా
ఒకటి కాదు రెండు కాదు.. ఇరవై ఏళ్లకు పైగా పరిచయం. పెద్దమ్మా, పిన్నీ, వదినా అంటూ వరసలు కలిపేవాడు. చిట్టీల వ్యాపారంతో స్థానికంగా మరింత చనువు పెంచుకున్నాడు. వారిళ్లలో ఏ దావతులైనా కుటుంబసమేతంగా వెళ్లేవాడు. ఆ చనువుతో పెద్దమొత్తంలో చిట్టీలు వేసేవారి సంఖ్య పెరిగింది. మొదట్లోనే చిట్టీ పాడుకుంటే డబ్బు తక్కువగా వస్తుందనే భావనతో.. చివరివరకూ కట్టుకుంటూ పోయారు. అదే వారిని నిండాముంచింది. ఇలా ఒకరిద్దరు కాదు.. దాదాపు 600కు పైగా బాధితులు ఇదే ఆశతో కోట్లలో వారి దగ్గర డబ్బు దాచారు. చివరకు మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.
police complaint