ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇకపై చీరాలలోనే కరోనా చికిత్స... - చీరాలలో కరోనా చికిత్స

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీరాలలోనే బాధితులకు చికిత్స అందించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు కొద్దిపాటి లక్షణాలు ఉన్నా... ఈ ప్రాంతం నుంచి ఒంగోలుకు తరలించేవారు. ఫలితంగా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీటిని అధిగమించేందుకు చీరాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందించేందుకు చర్యలు ప్రారంభించారు.

chirla govt hospital read to treat coorna patients instead  of going ongole
chirla govt hospital read to treat coorna patients instead of going ongole

By

Published : Jul 21, 2020, 10:19 AM IST

ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కొంతమందిని చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. చుట్టుపక్కల ఆరు మండలాలకు చీరాల ఏరియా వైద్యశాల ఒక్కటే ఉంది. ప్రస్తుతం చీరాల నియోజకవర్గంలో కరోనా కేసుల సంఖ్య 200కు చేరింది. మూడొంతుల మంది చికిత్స అనంతరం డిశ్చార్జీ అయ్యారు.

పాజిటివ్ వచ్చి తక్కువ లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించేందుకు ముందుగా వైద్యశాలలో 36 పడకలు ఏర్పాటు చేశారు. దీనికోసం నలుగురు డాక్టర్లు, ఆరుగురు స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది అవసరం కానున్నారు. ముందుగా వైద్యశాలలో ఉన్న సిబ్బందితో రోగులకు సేవలు అందించాలని నిర్ణయించారు.

అవసరమైతే ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకోవటానికి జిల్లా అధికారులను కలిసి నివేదిస్తామని వైద్యులు.. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి తెలిపారు. ప్రస్తుతం చీరాలలో ఎనిమిది మంది పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్నారు.

ఇదీ చూడండి

'అక్కడి సిబ్బంది, కేసుల వ్యవహారంపై ఏ నిర్ణయం తీసుకున్నారు..?

ABOUT THE AUTHOR

...view details