ఆమంచిని పార్టీలో చేర్చుకోవడంపై తనకు సమాచారమివ్వలేదని కొంత కాలంగా అధిష్ఠానంపై అలకబూనిన వైకాపా చీరాల నియోజకవర్గ బాధ్యుడు నేడు పార్టీకి రాజీనామా చేశారు. తొమ్మిదేళ్లుగా వైకాపా జెండా మోసినా గుర్తింపులేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపాకు అడుగడుగునా అడ్డుపడి కార్యకర్తలను వేధించిన ఆమంచిని పార్టీలోకి తీసుకుని తనను మనస్థాపానికి గురిచేశారన్నారు. ఈ మేరకు వైకాపా చీరాల నియోజకవర్గ సమన్వయకర్త పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని తెలిపారు. ఈ రోజు చంద్రబాబు సమక్షంలో తెదేపాలోకి చేరుతానని వెల్లడించారు. ఆమంచికి వ్యతిరేకంగా పని చేసి తెదేపా అభ్యర్ధి బలరాంను గెలిపించడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.