ప్రకాశం జిల్లా చీరాలలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. జాండ్రపేటలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మార్కెట్ కు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆదివారం కావడం వల్ల చేపలు, మాంసం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా చేరారు. విషయం తెలుసుకున్న చీరాల ఒకటవ పట్టణ ఎస్సై సురేష్.. తానే స్వయంగా పరిస్థితిని చక్కదిద్దారు. అంతా.. భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
లాక్డౌన్ మరచిన ప్రజలు... చక్కదిద్దిన ఎస్సై - chirla latest news
చీరాలలో ఏర్పాటు చేసిన మార్కెట్కు ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు భారీగా తరలివచ్చారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని రద్దీని క్రమబద్ధీకరించారు.
![లాక్డౌన్ మరచిన ప్రజలు... చక్కదిద్దిన ఎస్సై chirala si controlled sunday market in jandrapeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7040017-636-7040017-1588490643961.jpg)
పరిస్థితిని చక్కదిద్దుతున్న చీరాల ఎస్సై