'వాక్సినేషన్ కేంద్రం వద్ద గుంపులు-కరోనా వస్తుందేమో అన్న ఆందోళనలో ప్రజలు' పేరిట.. 'ఈటీవీ భారత్' కథనం ఇచ్చింది. దీనిపై అధికారులు స్పందించారు. ప్రకాశం జిల్లా చీరాలలోని ఆంధ్రరత్న మున్సిపల్ ఉన్నత పాఠశాల వద్దకు ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఏసయ్య చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఏప్రిల్ 10 లోపు మొదటి డోసు టీకా వేయించుకున్నవారు రెండో డోసు తీసుకోవాలని అధికారులు చెప్పడంతో.. ఒక్కసారిగా టీకా కేంద్రం వద్దకు ప్రజలు భారీగా చేరుకున్నారు. టీకా, పేరు నమోదు కేంద్రం ఒకే దగ్గర పెట్టడంతో.. ఒకరినొకరు నెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రజల ఇబ్బందులపై.. 'ఈటీవీ భారత్'లో కథనం వచ్చింది.
ఇదీ చదవండి:'భారత్, బ్రిటన్ స్ట్రెయిన్లపై కొవాగ్జిన్ సమర్థవంతం'