ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా సహకరించండి' - ప్రకాశం జిల్లా వార్తలు

పురపాలక ఎన్నికల కౌంటింగ్​కు సంబంధించిన ఏర్పాట్లపై చీరాల మున్సిపల్ కమిషనర్ ఏసయ్య సమావేశం నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ సజావుగా జరిగే విధంగా అందరూ సహకరించాలని కమిషనర్ కోరారు.

municipal elections
కౌంటింగ్​పై సమావేశం

By

Published : Mar 13, 2021, 10:16 AM IST

ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కమిషనర్ ఏసయ్య కోరారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. 14వ తేదీ ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపునకు సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలను ముస్తాబు చేశారు. ఈ ప్రక్రియలో 3 వార్డులకు ఒకొక్క గది చొప్పున కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఒక్కో వార్డు కౌంటింగ్​కు ముగ్గురు అధికారులతో పాటు ఏజెంట్లను నియమించినట్టు తెలిపారు. ప్రతి ఒక్క ఏజెంట్ తమ గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని... ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ పక్రియ 11 గంటలకల్లా ముగియాలని కమిషనర్ తెలిపారు. గెలిచిన అభ్యర్థుల జాబితాలను వెంటనే విడుదల చేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details