ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేను ప్రజల మనిషిని - ఆమంచి కృష్ణమోహన్

సీఎం సామాజిక వర్గానికి చెందిన కొంతమంది తమకు అవాంతరాలు సృష్టించారని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లొకేష్ దృష్టికి తీసుకెళ్లినా లాభంలేకపోయిందని.. అందుకే పార్టీ మారానని స్పష్టం చేశారు.

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్

By

Published : Feb 16, 2019, 11:28 AM IST

Updated : Feb 16, 2019, 11:34 AM IST

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ప్రజలకు తాను కాపలాదారుడినని.. అప్పుడు తెదేపాలో చేరినా, ఇప్పుడు వైకాపాలో చేరినా ప్రజలకోసమేనని అన్నారు. పందిళ్లపల్లిలోని ఆమంచి నివాసంలో కార్యకర్తల సమవేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన కొంతమంది తమకు అవాంతరాలు సృష్టించారని... ఈవిషయమై సీఎం చంద్రబాబు, మంత్రి లొకేష్ దృష్టికి తీసుకెళ్లినా లాభంలేకపోయిందన్నారు. ఈక్రమంలోనే కార్యకర్తలతో మాట్లాడి వైకాపాలోకి చేరానని ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు.

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్

ఇవి కూడా చదవండి...

Last Updated : Feb 16, 2019, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details