నేరాలు జరిగినప్పుడు కేసులు విషయంలో పరిశోధన ఎలా చేయాలో ప్రకాశం జిల్లా ఇంకొల్లులో పొలీసులకు చీరాల డీఎస్పీ అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి జియో (జూనియర్ ఇన్ వెస్టిగేషన్ ఆఫీసర్ ) ప్రాజెక్టులో భాగంగా ఇంకొల్లులొని రోటరీ కాన్ఫరెన్స్ హాల్లో చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్, ఇంకొల్లు సీఐ అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంకొల్లు సర్కిల్ పరిధిలోని జియోస్ హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు.. అందరికీ నేర పరిశోధనలో నైపుణ్యం మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఇంకొల్లులో పోలీసులకు అవగాహన కార్యక్రమం - ప్రకాశం జిల్లా వార్తలు
నేర పరిశోధనలో తీసుకోవాల్సిన మెలకువల గురించి పోలీసులకు చీరాల డీఎస్పీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు రిటైర్డ్ అధికారులు హాజరై పరిశోధనలు ఎలా చేయాలో వివరించారు.
ఈ కార్యక్రమానికి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సుంకర సాయి బాబా, ఒంగోలు రిమ్స్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ ఎం సుబ్బారావు, ఐఐఐఆర్డీ ఎంఎం కోర్టు ఏపీపీ చంద్ర కుమారి, పర్చూరు రిటైర్డ్ సీనియర్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ శ్రీ షేక్ ఆజాద్, పర్చూరు కోర్టు సీనియర్ న్యాయవాది శ్రీ ఎం రవీంద్రా రెడ్డి ,ఇంకొల్లు,మార్టూరు ఎమ్మార్వోలు ప్రసాద రావు, వెంకటరెడ్డి హాజరయ్యారు. రెవెన్యూ, మెడికల్, జుడీషియల్ శాఖలకు సంబంధించి నేర పరిశోధనలో తీసుకోవలసిన మెలకువల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి సర్కిల్ పరిధిలోని ఎస్సైలు హాజరయ్యారు.
ఇదీ చదవండి :