కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం నిమగ్నమవటంతో అన్ని అర్హతలున్న ప్రకాశం జిల్లా చీరాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన సమితి డిమాండ్ చేసింది. చీరాల జిల్లా జేఏసీ అధ్యక్షుడు తాడివలస దేవరాజ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ స్థానాన్ని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో చీరాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వారు కోరారు.
'చీరాలను జిల్లాగా ప్రకటించాలని జేఏసీ డిమాండ్' - chirala district jac demands news update
అన్ని అర్హతలున్న చీరాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని జేఏసీ సభ్యులు డిమాండ్ చేశారు. చీరాల జిల్లా జేఏసీ అధ్యక్షుడు తాడివలస దేవరాజ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
చీరాల జిల్లా సాధన సమితి సమావేశం