ప్రకాశం జిల్లా చీరాలలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి విధులు నిర్వర్తించకుండా ఉన్న సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటి సర్వేచేయమంటే కూర్చుని ఆటలాడుకుంటారా? అని సిబ్బందిపై కోపోద్రిక్తులయ్యారు. సిబ్బంది నిర్లక్ష్యానికి జయంతిపేటలో కేసులు పెరుగుతున్నాయంటూ సచివాలయ సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఇంటింటి సర్వేచేయమంటే కూర్చుని ఆటలాడుకుంటారా?' - ప్రకాశం జిల్లా కరోనా వార్తలు
ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చీరాల మున్సిపల్ కమిషనర్ ఇంటింటి సర్వే చేపట్టాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. కానీ, విధులు నిర్వర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జయంతిపేట సచివాలయ సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటి సర్వేచేయమంటే కూర్చుని ఆటలాడుకుంటారా? అని మండిపడ్డారు.
ఇంటింటి సర్వేచేయమంటే కూర్చుని ఆటలాడుకుంటారా?
ఒకే కుటుంబంలో 8మందికి కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయంటే అది మీ నిర్లక్ష్యమేనన్నారు. ఏ.ఎన్.ఎం రమాదేవి, వాలంటీర్ జోత్స్నలను సస్పెండ్ చేశారు. వాలంటీరు, సిబ్బంది పనితీరు గుర్తించకుండా ఉన్న వార్డు అడ్మిన్ సెక్రెటరీ రాకేష్ వర్మను మున్సిపల్ కార్యాలయానికి బదిలీ చేశారు. జయంతిపేటలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో గొల్లపాలెంలో కొందరు కలిశారని, వారిని గుర్తిస్తున్నామని కమిషనర్ రామచంద్రారెడ్డి తెలిపారు.