ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వృద్ధురాలి ఇంట్లో చోరీ.. నిందితుడు అరెస్ట్​ - prakasam district latest news

వృద్ధురాలి ఇంట్లో బంగారం ఎత్తుకెళ్లిన దొంగను చినగంజాం పోలీసులు అరెస్ట్​ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. మూడు సవర్ల బంగారం గొలుసు, రూ. 2,700 నగదును స్వాధీనం చేసుకున్నారు.

chinaganjam police arrested a person who theft in a old woman house
వృద్ధురాలి ఇంట్లో చోరీ చేసిన వ్యక్తులు అరెస్ట్​

By

Published : Jun 2, 2020, 8:25 PM IST

ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లో దొంగతనం చేసిన కేసు నిందితుడిని ప్రకాశం జిల్లా చినగంజాం పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 27న నీలాయిపాలెంలో వృద్ధురాలు నిద్రిస్తున్న సమయంలో... ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో ఉన్న నగదు, బంగారం ఎత్తుకెళ్ళారు. చోరీని గుర్తించిన అనంతరం బాధితురాలు తూమాటి బేబీ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు చేపట్టిన చినగంజాం పోలీసులు ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన నిందితుడు తెలగతోటి అశోక్​ను అరెస్ట్​ చేశారు. అతడికి కొవిడ్-19 పరిక్ష నిర్వహించగా నెగిటివ్ రిపోర్టు వచ్చిందని తెలిపారు. అశోక్ నుంచి మూడు సవర్ల బంగారు గొలుసు, రూ. 2,700 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో నిందితుడు విజయ్ కోసం గాలింపు చేపట్టామని ఇంకొల్లు సీఐ రాంబాబు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details