ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలం చెల్లిన మందులు... బలైన పసిపాప ప్రాణాలు - child died due to expired medicine news

నవమాసాలు మోసి కన్న బిడ్డకు.. రోజుల వ్యవధిలోనే నూరేళ్లు నిండాయి. గడువు ముగిసిన చుక్కల మందు వేయటంతో మృతి చెందినట్లు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లులో జరిగింది.

expired medicine
గడువు ముగిసిన మందులు

By

Published : Jan 22, 2021, 12:10 PM IST

గడువు ముగిసిన చుక్కల మందు తాగించడం వల్ల తమ పాప మృతి చెందిందని కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన ప్రకాశంజిల్లా, ముండ్లమూరు మండలం పసుపుగల్లులో చోటుచేసుకుంది.

స్థానికుల వివరాల ప్రకారం:

కురుచేడు మండలం నమ:శివాయపుర అగ్రహారానికి చెందిన కేశనపల్లి నవనీతం స్వగ్రామమైన పసుపుగల్లుకు వచ్చారు. 17 రోజుల క్రితం చీమకుర్తిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో నవనీతం.. పాపకు జన్మనిచ్చింది. పాపకు వాంతులు, విరేచనాలు అవుతున్న కారణంగా.. ముండ్లమూరుకు చెందిన ఓ ఆర్​ఎంపీకి చెప్పి.. మందులు తెప్పించారు. అతను రెండు రకాల మందులు ఇచ్చాడు. వాటిని తాగించిన అరగంట వ్యవధిలో నోటి వెంట నురగలు వచ్చి బిడ్డ మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ మందులను పరిశీలించగా గడువు తేదీ ముగిసినట్లుగా ఉందని కుటుంబసభ్యులు చెప్పారు. పాప మృతదేహంతో పోలీస్​స్టేషన్​కు చేరుకొని ఆర్​ఎంపీ, మందుల దుకాణదారుడిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

అంతుచిక్కని వ్యాధితో 21 మంది అస్వస్థత

ABOUT THE AUTHOR

...view details