జగనన్న గోరుముద్ద పథకం కింద పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంతోపాటుగా వేరుశనగ చిక్కీలను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇప్పటికే టెండర్లు దక్కించుకున్న సంస్థలు ఈ మేరకు తయారీ చేపట్టారు. అయితే వీటి ప్యాకింగ్‌పై జగనన్న గోరుముద్ద పథకం లోగోతోపాటుగా సీఎం చిత్రాన్ని కూడా ముద్రించడం పలు విమర్శలకు తావిస్తోంది. విద్యార్ధులకు ఇచ్చే తినుబండారాలపై ముఖ్యమంత్రి చిత్రాన్ని ముద్రించడం చర్చనీయాంశమైంది. పూర్తి స్థాయిలో పాఠశాలలు ప్రారంభం కానప్పటికీ విద్యార్థులు ఇంటి వద్దకే వీటిని అందజేయనున్నారు.
పిల్లలకు ఇచ్చే తినుబండారాలను వదల్లేదు.. - jaganna gorumudda latest news update
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో పౌష్టిక విలువలున్న చిక్కీలను ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పూర్తి స్థాయిలో స్కూళ్లు తెరుచుకోనప్పటికీ విద్యార్థుల ఇంటి వద్దకే జగనన్న గోరు ముద్ద పథకం కింద వీటిని అందించేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే లోగోను ముద్రించే కాగితంపై జగన్ చిత్రాన్ని కూడా ముద్రించడం పలు విమర్శలకు తావిస్తోంది.
పిల్లలకు ఇచ్చే తినుబండారాలపై జగనన్న చిత్రం