Chennakesava Temple: జై చెన్నకేశవ.. జై జై చెన్నకేశవ అంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం పురవీధులు మార్మోగాయి. శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. రథోత్సవం కన్నుల పండువగా సాగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన రథంపై శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవస్వామి.. మాఢవీధుల్లో ఊరేగారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు.
వైభవంగా చెన్నకేశవస్వామి రథోత్సవం.. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ - శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు
Chennakesava Temple: శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవస్వామి నామస్మరణతో మార్కాపురం వీధులు మార్మోగాయి. జై చెన్నకేశవ.. జై జై చెన్నకేశవ అంటూ రథోత్సవం కన్నుల పండువగా సాగింది.
వైభవంగా చెన్నకేశవస్వామి రథోత్సవం