ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి అశేష పూజలందుకుంటున్నారు. తొమ్మిదో రోజు శ్రీరాముని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 9 రోజులుగా కొనసాగుతున్న వేడుకల్లో స్వామివారు అశేష పూజలందుకుంటున్నారు. తొమ్మిదో రోజు హనుమంత వాహనంపై శ్రీరాముని అలంకారంలో చెన్నకేశవుడు భక్తులకు దర్శనమిచ్చారు. మేళతాళాలతో అశేష భక్తజనం మధ్యన మాఢవీధుల్లో స్వామి వారిని ఊరేగించారు.