ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాలలో ఉల్లి లొల్లి... ప్రజల 'వ్యయ' ప్రయాసలు! - onions in cheerala latest news

ప్రకాశం జిల్లా చీరాలలో ఉల్లి లొల్లి కొనసాగుతోంది. పట్టణ ప్రజలు ఒక్క కిలో ఉల్లిపాయలు తీసుకోవాలంటే... వ్యయప్రయాసలు పడాల్సిన పరిస్దితి నెలకొంది.

cheerala people facing problems for subsidy onion taking
చీరాలలో ఉల్లి లొల్లి... ప్రజలు 'వ్యయ' ప్రయాసలు

By

Published : Dec 15, 2019, 11:16 PM IST

చీరాలలో ఉల్లి లొల్లి... ప్రజలు 'వ్యయ' ప్రయాసలు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉల్లి తిప్పలు తప్పట్లేదు. ప్రకాశం జిల్లా చీరాలలో రాయితీ ఉల్లి కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో ప్రజలు నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. వ్యవసాయ మార్కెట్ చీరాల పట్టణానికి ఎనిమిది కిలోమీటర్లు దూరంలో ఉంది. ప్రభుత్వం ఇస్తున్న ఒక కిలో ఉల్లిపాయలు కోసం చీరాల,ఈపురుపాలెం, వేటపాలెం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఈ వ్యవసాయ మార్కెట్ అందుబాటులో లేదు. పట్టణం నుంచి రాను పోనూ 30 రూపాయలు ఖర్చు చేసి ఆటోలో వస్తున్నామని... తీరా వచ్చాక గంటలకొద్దీ క్యూ లైన్లో నిలబడి కిలో ఉల్లిపాయలు తీసుకోవాల్సి వస్తుందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తే తమకు ఈ కష్టాలు ఉండవని అన్నారు.

చిన్నపిల్లలకు ఇవ్వరా....

తమ ఇంట్లో వాళ్లు రాలేని పతిస్థితుల్లో ఉంటే తన ఆధార్ తీసుకొచ్చానని... అయితే చిన్నపిల్లలకు ఉల్లిపాయలు ఇచ్చేది లేదని అధికారులు, సిబ్బంది చెబుతున్నారని భవ్య అనే చిన్నారి ఆవేదన వ్యక్తం చేసింది.

ఇవీ చూడండి

పేదల గృహాలు, విద్యుత్ స్తంభాలకూ వైకాపా రంగు వేశారు..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details