ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. అజెండాలోని 25 అంశాలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కౌన్సిలర్ పొదిలి ఐస్వామి మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం జీరో అవర్ ని ప్రకటించగా... ఛైర్మన్ రమేష్ బాబు.. అజెండాలోని అంశాలన్నీ ఆల్ పాస్ అంటూ వెళ్ళిపోయారు. ఈ పరిణామంపై తెలుగుదేశం కౌన్సెలర్లు నిరసనకు దిగారు. అజెండాలోని అంశాలన్నీ చదవకుండా వెళ్లిపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మూడు నెలలుగా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా.. చైర్మన్ రమేష్ బాబు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏకపక్ష నిర్ణయాలపై తెదేపా కౌన్సెలర్ల నిరసన! - ప్రకాశం జిల్లా
చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అజెండాలోని ఆంశాలు చదవకుండా.. ఆల్ పాస్ అంటూ ఛైర్మన్ వెళ్లిపోవటంపై తెదేపా కౌన్సిలర్లు నిరసనకు దిగారు.
చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం