CHECK DAM BLAST AT PRAKASAM DISTRICT: ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలో నీటి నిల్వ కోసం నిర్మించిన చెక్ డ్యాంను మల్లిఖార్జున్ అనే వ్యక్తి కూల్చివేశాడు. గత ప్రభుత్వ హయాంలో నల్లవాగుపై తొమ్మిదిన్నర లక్షల రూపాయలతో చెక్ డ్యాం నిర్మించారు. తన పొలం వద్ద చెక్ డ్యాం నిర్మించారని ఆగ్రహం చెందిన మల్లిఖార్జున్.. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు జిలెటిన్ స్టిక్స్‌తో రాత్రికి రాత్రే పేల్చివేశాడు. దాంతో చెక్ డ్యాం పూర్తిగా ధ్వంసమైంది. చెక్ డ్యాం ధ్వంసమైన స్థలాన్ని ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. ఆ ఘటనకు కారణమైన మల్లిఖార్జున్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మల్లిఖార్జున్ వైసీపీకి మద్దతుదారుడిగా ఉన్నట్లు సమాచారం.
నీటి నిల్వ కోసం నిర్మించిన చెక్ డ్యాం పేల్చివేత.. పరారీలో నిందితుడు - దోర్నాలలో చెక్ డ్యాం పేల్చివేత
CHECK DAM BLAST IN PRAKASAM : గత ప్రభుత్వం నీటి నిల్వ కోసం తొమ్మిదిన్నర లక్షల రూపాయలతో ఓ చెక్‌డ్యాంను నిర్మించింది. అయితే ఆ చెక్‌డ్యాం తన పొలం వద్ద ఉందని ఆగ్రహించిన ఓ వ్యక్తి దానిని రాత్రికి రాత్రే కూల్చివేశాడు.
CHECK DAM BLAST