ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు జరిపారు. మండలంలోని బాలాజీ తండా, సంగం తండా గ్రామాల్లో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. తయారీకి సిద్ధంగా ఉంచిన 450 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఇటువంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నాటుసారా స్థావరాలపై దాడులు.. 450 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - త్రిపురాంతకంలో నాటుసారా తయారీ
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని బాలాజీ తండా, సంగం తండా గ్రామాల్లోని నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. సుమారు 450 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

నాటుసారా స్థావరాలపై దాడులు