ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CHANDRABABU: డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ - ap top news

మొగిలిచర్లకు చెందిన తెదేపా కార్యకర్తలను వైకాపా నేతలు వేధిస్తున్నారంటూ తెదేపా అధినేత చంద్రబాబు... డీజీపీ గౌతమ్ సవాంగ్​కు లేఖ రాశారు.

chandrababus-letter-to-dgp-gautam-sawang
డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ

By

Published : Sep 8, 2021, 9:37 AM IST

ప్రకాశం జిల్లా మొగిలిచర్లకు చెందిన పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు... డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. వైకాపా నేతల ఆదేశాలతో ప్రకాశం జిల్లా లింగసముద్రం పోలీసులు వారిని వేధిస్తున్నారని ఆరోపించారు. ఆరుగురు కార్యకర్తలను స్టేషన్‌కు పిలిపించారని... ఆరు, పదేళ్ల చిన్నారులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. కార్యకర్తలు రత్తయ్య, శ్రీకాంత్‌ను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారన్న చంద్రబాబు... వేధింపులు తట్టుకోలేక వారు ఆత్మహత్యకు యత్నించారని అన్నారు.

ఆత్మహత్యకు యత్నించిన తర్వాత మిగిలిన వారిని స్టేషన్‌ నుంచి పంపారని వైకాపా నేతల రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులు పనిచేస్తున్నారని లేఖలో విమర్శించారు. రెండేళ్లలో పోలీసుల బెదిరింపులు తారాస్థాయికి చేరుకున్నాయన్న చంద్రబాబు.. లింగసముద్రం ఘటనపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో డీజీపీని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి:RE ISSUE: ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details