ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గ్రానైట్ పరిశ్రమను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు' - మద్దిపాడు ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబు న్యూస్

ప్రకాశం జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. 50 వేల మందికి ఉపాధినిచ్చే.. గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే గ్రానైట్ పరిశ్రమను పూర్తిగా నాశనం చేయడానికి 1900 కోట్ల రూపాయలు ఫైన్ వేసే స్థితికి వచ్చారని మండిపడ్డారు.

'గ్రానైట్ పరిశ్రమను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు'
'గ్రానైట్ పరిశ్రమను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు'

By

Published : Feb 19, 2020, 10:14 PM IST

'గ్రానైట్ పరిశ్రమను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు'

రాష్ట్రంలో తుగ్గక్ పాలన నడుస్తోందని చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు గ్రామంలో ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజలంతా ఒక్క తాటిపైకి వచ్చి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో తెదేపాకు అఖండ విజయాన్ని అందించి.. వైకాపాకు బుద్ధి చెప్పాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details