కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లులో గుప్తనిధుల కోసం ఆంజనేయస్వామి, అమ్మవారి విగ్రహాలను దుండగులు పెకిలించడంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట్లోనే ఈ అరాచక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తే ఇలాంటి విధ్వంసకాండకు అడ్డుకట్ట పడేదని వ్యాఖ్యానించారు. ఇటువంటి దురాగతాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. దేవాలయాలు, దేవతా విగ్రహాలకు ప్రత్యేక భద్రత కల్పించాలని కోరారు.
ప్రభుత్వ ఉదాసీనత వల్లే దేవాలయాలపై దాడులు: చంద్రబాబు - పొన్నకల్లు దేవతా విగ్రహాల ధ్వంసం వార్తలు
ప్రభుత్వ ఉదాసీనత వల్లే రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆలయాలు, దేవతా విగ్రహాలకు ప్రత్యేక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వరుస దాడి ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. కర్నూలు జిల్లా పొన్నకల్లులో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెకిలించడం గర్హనీయమని ధ్వజమెత్తారు.

చంద్రబాబు