ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రెండ్రోజులుగా ఆస్పత్రి ఆవరణలో మృతదేహాన్ని అలానే వదిలేశారన్న చంద్రబాబు... ఆ మృతదేహాన్ని కుక్కలు పీక్కుని తింటున్నా పట్టించుకున్న వారే లేరని ఆక్షేపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులు నరకం చూస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.
'ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది' - ఒంగోలు ఘటనపై చంద్రబాబు సీరియస్ వార్తలు
ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రెండ్రోజులుగా ఆస్పత్రి ఆవరణలో మృతదేహాన్ని అలానే వదిలేశారన్న చంద్రబాబు... మృతదేహాన్ని కుక్కలు పీక్కుని తింటున్నా పట్టించుకున్న వారే లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులు నరకం చూస్తున్నారని.. ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
!['ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది' Chandrababu criticize jagan's govt over Ongole Incident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8377098-637-8377098-1597137788137.jpg)
చంద్రబాబు ట్వీట్
చంద్రబాబు ట్వీట్
ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.
ఇదీ చదవండీ... మాకు మహానగరాలు లేవు.. మెరుగైనవైద్యం కోసం సహకారం ఇవ్వండి: సీఎం