పోలీసుల నిర్బంధాల మధ్యే.. విజయవాడకు ఉద్యోగులు - విజయవాడ లేటేస్ట్ వార్తలు
పోలీసుల నిర్బంధాల మధ్య... ప్రకాశం జిల్లా చీరాల, పర్చూరు ప్రాంతాల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు చలో విజయవాడ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేసినా.... వారి కళ్లుకప్పి ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలి వెళ్లారు. గూడూరు నుంచి విజయవాడ వెళ్లే ఎక్స్ ప్రెస్ రైల్లో... చీరాల నుంచి సుమారు వంద మందికి పైగా విజయవాడకు తరలివెళ్లారు.
chalo vijayawada in prakasham district
పీఆర్సీ సాధన కమిటీ పిలుపుతో ప్రకాశం జిల్లా చీరాల, పర్చూరు ప్రాంతాల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు చలో విజయవాడ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేసినా.. వారి కళ్లుకప్పి ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలి వెళ్లారు. గూడూరు నుంచి విజయవాడ వెళ్లే ఎక్స్ ప్రెస్ రైల్లో. చీరాల నుంచి సుమారు వంద మందికి పైగా విజయవాడకు తరలివెళ్లారు.
- యర్రగొండపాలెం నుంచి విజయవాడకు వెళ్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు
- సంతమాగులూరు మండలం కేంద్రమైన పుట్టవారిపాలెం జంక్షన్ వద్ద అనంతపురం కర్నూలు జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు చలో విజయవాడకు వెళుతుండగా.. పోలీసులు అడ్డుకున్నారు.
- బేతంచెర్ల, ఆదోని, పెనుగొండ పరిసర ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున , పదుల సంఖ్యల వాహనాలతో విజయవాడకు బయలుదేరారు. వారిని సంతమాగులూరు వద్ద అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. సుమారు 100 మంది పైనే ఉపాధ్యాయులను అడ్డుకున్నారు. వారిని బయటకు పంపకుండా అల్పాహారాన్ని కూడా పోలీసులే అందజేశారు. చలో విజయవాడకు పర్మిషన్ లేదంటూ, వాహనాలను స్వాధీన చేసుకున్నారు.
- పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమానికి వెళుతుండగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
- అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో విజయవాడ వెళ్తున్న అనంతపురం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. వారు ప్రయాణిస్తున్న వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ వెళ్లేందుకు పర్మిషన్ లేదంటూ వాహనాలు నిలుపుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.
- చలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులు వెళ్లకుండా కనిగిరి పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రకాశం జిల్లా కనిగిరి మీదుగా విజయవాడకు వెళుతున్న అనంతపురం, కడప జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ, అధ్యాపక, ఉద్యోగ, వీఆర్వో సంఘాలకు చెందిన నాయకులను అడ్డుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
- మార్కాపురం, పొదిలిలో ఉద్యోగ సంఘ నాయకుల ఇళ్ల వద్ద బందోబస్తు నిర్వహించారు. పొదిలిలో ఎస్సై శ్రీహరి ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ వెళ్లే పలు వాహనాలు, బస్సులను స్టేషన్ కు తరలించారు.
- ఇదీ చదవండి:విజయవాడ ఎన్జీవో భవన్ వద్దకు ఒక్కసారిగా వచ్చిన ఉద్యోగులు