ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రామాయపట్నం పోర్టుపై.. జీవీఎల్ ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం - రామాయపట్నం పోర్టుపై కేంద్రమంత్రి సమాధానం

ఆగస్టులో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో రామాయపట్నం పోర్టుపై జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు.. కేంద్రమంత్రి మన్​సుఖ్ మాండవీయ సమాధానం పంపారు.

central minister mansukh mandaviya answet to gvl narasimharao question on ramayapatnam port
రామాయపట్నం పోర్టుపై.. జీవీఎల్ ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం

By

Published : Dec 9, 2019, 10:04 PM IST

గత సమావేశాల్లో భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు.. కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సమాధానం పంపారు. ఆగస్టులో జరిగిన సమావేశాల్లో రామాయపట్నం వద్ద పోర్టు నిర్మాణంపై జీవీఎల్ ప్రశ్న లేవనెత్తారు. ఏపీ పునర్విభజన చట్టంలో కేవలం దుగరాజపట్నం పోర్టు నిర్మాణం మాత్రమే పొందుపరిచారని కేంద్ర మంత్రి చెప్పారు. దుగరాజపట్నం పోర్టు సాధ్యంకాదని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపామన్నారు. మరో ప్రాంతాన్ని ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మాండవీయ వివరించారు. పోర్టు నిర్మాణంపై అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామనీ.. వారి నివేదికను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details