ఒంగోలులో భారతీయజనతాపార్టీ చేపట్టిన సంకల్పయాత్రలో కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి పరుషోత్తం రూపాలా పాల్గొన్నారు. శనగ రైతులకు గిట్టుబాటు ధరలు, పంట బీమా అమలు విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రితోపాటు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు.
ఒంగోలులో కేంద్రమంత్రి పర్యటన... శనగ రైతులకు భరోసా - కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తాజా న్యూస్
కేంద్ర ప్రభుత్వం శనగరైతులను ఆదుకుంటుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పరుషోత్తం రూపాలా హామీ ఇచ్చారు. ఒంగోలులో గాంధీజీ సంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన రైతులనుద్దేశించి ప్రసంగించారు.
![ఒంగోలులో కేంద్రమంత్రి పర్యటన... శనగ రైతులకు భరోసా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4911541-806-4911541-1572444272701.jpg)
శనగరైతులకు అండగా మేముంటాం:భాజపా
ఒంగోలులో పర్యటిస్తున్న కేంద్రమంత్రి
Last Updated : Oct 30, 2019, 11:26 PM IST